Sunday, March 16, 2008
మనసులో మాట
ఎన్నో సార్లు అనుకున్నాను కవితలు రాసి కవ్వి౦చాలని
కాని కలవరపడి రాయలేపొయాను ఊహించింది.
చదివాను నువ్వుశెట్టి వారి కృకీలు, చూశాను బ్లాగర్ల కవిత్వ బాణీలు
అప్పుడు అనుకున్నాను కష్టపడితే ఫలితం ఉంటుందని
ప్రారంభించాను శ్రీకారం చుట్టి, స్థుతించాను సరస్వతీ దేవిని,
ప్రారంభించాను విఘ్నేశ్వర స్థుతితో
సూర్యుడు ఉదయించినపుడు వెలుతురొస్తుంది
పుష్పాలు కూడా నిద్రనించి లేచి వికసిస్తాయి.
వికసించిన పుష్పాలే మన జీవితానికి నాంది
కలం లోంచి కవిత్వ బాణీలు వ్రాసినపుడే కలుగుతుంది అనుభూతి
ఆ అనుభూతి మరువని నాడు, మనుగడకు ఉంటుంది మొదటి మెట్టు
అందుకే రచయితలకు రచయిత్రులకు అంటాను అధైర్య పడక
ఆవేశం తో నిగ్రహం తో కవితలు వ్రాయండి.
తెలుగుతల్లికి జోహార్లు పలకండి.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
బ్లాగోకానికి స్వాగతం. మీరు మంచి రచనలు చేయాలని కోరుకుంటున్నాను.
Post a Comment